తుపానుకు సెన్యార్ గా నామకరణం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది

Update: 2025-11-26 06:06 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది. రేపటికి తుపాన్‌గా బలపడనుందని ఐఎండీ అంచనా వేసింది. తుపాన్‌గా మారాక 'సెన్యార్'గా నామకరణం చేశారు. పశ్చిమ వాయువ్య దిశగా రెండు వేల కిమీ దూరంలో వాయుగుండం కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

ఆరు రోజులు వానలు...
తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


Tags:    

Similar News