Cyclone : దూసుకొస్తున్న ద్వితా తుపాను.. ఈ జిల్లాల వారికి హై అలెర్ట్
దిత్వా తుపాను ప్రభావంతో ఇప్పటికే శ్రీలంకలో భారీ వర్షాలతో పాటు భారీ వరదలు సంభవిస్తున్నాయి
నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాన్ ప్రభావం కోనసాగుతుంది. రేపటికి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ప్రాంతాలకు చేరే అవకాశం ఉంది. దిత్వా తుపాను ప్రభావంతో ఇప్పటికే శ్రీలంకలో భారీ వర్షాలతో పాటు భారీ వరదలు సంభవిస్తున్నాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇక తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు కూడా దిత్వా తుపాను దెబ్బ భారీగా తగిలే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు కూడా తుపాను ఎఫెక్ట్ మామూలుగా ఉండదన్న అంచనాలు వినపడుతున్నాయి. అయితే తుపాను తీరం ఎక్కడ దాటుతుంది? లేదా తీరం వెంట పయనిస్తుందా? అన్న దానిపై మాత్రం ఇంకా వాతావరణ శాఖ క్లారిటీ ఇవ్వలేదు.
నేడు, రేపు భారీ వర్షాలు...
అయితే దిత్వా తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దిత్వా తుపాను ప్రభావం ప్రభావం ఎక్కువగా తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉంటుందని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆ యా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని కోరింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో ప్రమాదకరమైన హోర్డింగ్స్ వెంటనే తొలగిస్తున్నారు.
తెలంగాణలో నేడు...
శిథిలావస్థ స్థితిలోని ఇళ్లల్లో ఉండేవారిని గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ F బృందాలు ఆ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలని, సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తమ పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించింది. మరొకవైపు తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు దిత్వా ప్రభావంతో పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.