Cyclone Montha : ఈ జిల్లాలకు ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్
మొంథా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తీవ్రంగా చూపుతుంది. రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది
మొంథా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తీవ్రంగా చూపుతుంది. రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కోస్తా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే ప్రాంతాలను గుర్తించి అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలెర్ట్ జారీ చేసింది.
ఇక్కడ అలెర్ట్...
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో అధికారులు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.