51 ఏళ్లుగా సైకిల్ పై తిరుగుతూ
51 ఏళ్లుగా నిత్యం సైకిల్ పై తిరుగుతూ సైన్యం గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు విశ్రాంత జవాన్.
51 ఏళ్లుగా నిత్యం సైకిల్ పై తిరుగుతూ సైన్యం గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు విశ్రాంత జవాన్. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పసుపులేటి మోహనరావు 1963 నుంచి 1974 వరకు సైన్యంలో పని చేశారు. సిపాయిగా అడుగుపెట్టి నాయక్ హోదాలో రిటైర్ అయ్యారు. సైన్యం నుంచి వచ్చాక తెనాలిలో విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘాన్ని నెలకొల్పి ఎంతో మందికి అండగా నిలిచారు. సైన్యం నుంచి విరమణ పొందినప్పటి నుండి ఈరోజు వరకు 51 ఏళ్లుగా ఆయన సైకిల్ మీదే తిరుగుతూ ఉంటారు. 88 ఏళ్ల వయసులోనూ రోజూ 6 కిలోమీటర్లు సైకిల్ మీద తిరుగుతుంటారు. సైనిక దుస్తులు లేదా తెల్లటి దుస్తులు ధరించే ఇంటి నుంచి బయటకు వస్తారాయన. సైకిల్ కు జాతీయ జెండా ఉంటుంది. ఆయన దుస్తులకు సాధించిన పతకాలను కట్టుకుంటారు. యువతకు సైన్యం గొప్పతనం, క్రమశిక్షణ చెబుతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తూ ఉంటారు.