మంత్రి అల్లుడి కార్యాలయంలో సైబర్ మోసం..1.40 కోట్లు కొట్టేసి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌ కంపెనీలో సైబర్‌ మోసం జరిగింది

Update: 2025-08-23 06:09 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌ కంపెనీలో సైబర్‌ మోసం జరిగింది. పునీత్‌ పేరుతో అకౌంటెంట్‌కు సైబర్‌ కేటుగాళ్ల మెసేజ్ వచ్చింది. అత్యవసరంగా రూ.1.40 కోట్లు కావాలంటూ మెసేజ్‌ రావడంతో వెంటనే అకౌంటెంట్ డబ్బులు పంపారు. అయితే పునీత్ కు ఫోన్ చేయడంతో తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని తేలింది.

పోలీసుల అదుపులో...
దీంతో తాము మోసపోయినట్టు గుర్తించి అకౌంటెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సైబర్‌ నేరగాళ్లు సంజీవ్‌, అరవింద్‌ అరెస్ట్‌ చేశారు. ఇందులో మరో నిందితుడు ఆచూకీ మాత్రం లభించలేదు. సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో నేరగాళ్లు దొరికారని అంటున్నారు. సైబర్ నేరాల పట్ల, మెసేజ్ లు, ఫోన్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.


Tags:    

Similar News