Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎలా ఉందో తెలిస్తే?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2025-05-31 02:43 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా సత్వరం దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలకు భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి.

అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోతున్నాయి. బయట వరకూ క్యూ లైన్ గత కొద్ది రోజులుగా విస్తరించి ఉండటంతో శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను క్యూ లైన్లలోనే పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్ల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం ఆలస్యం కానుండటంతో గత కొద్ది రోజుల నుంచి భక్తులకు అన్న ప్రసాదంతో పాటు మజ్జిగ, మంచినీటిని కూడా పంపిణీ చేస్తున్నారు. మరికొద్ది రోజులు ఈ రద్దీ తిరుమలలో కొనసాగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూలైన్ లో వేచి ఉన్నభక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. అలాగే టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,011 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News