Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు

Update: 2025-04-28 03:35 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు. వరస సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సహజంగా వేసవి సెలవులు ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ ఇక ఎక్కువగా ఉంటుంది. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మే 1వ తేదీ నుంచి జులై పదిహేను తేదీ వరకూ సిఫార్సు లేఖలను అనుమతించమని తెలిపారు. వేసవి రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. డైరెక్ట్ లైన్ ద్వారా శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.

వసతి గృహాలు కేటాయింపు...
ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే తిరుమల టిక్కెట్లతో పాటు వసతి గృహాలు కూడా ఇస్తున్నారు. వసతి గృహాల కేటాయింపులో కూడా సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించారు. అందుకే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు కాలినడకన వచ్చేభక్తులకు వసతి గృహాల సౌకర్యం కూడా కల్పించనున్నారు. వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి టీటీడీ ముందస్తు నిర్ణయాలు తీసుకుంటుంది.
హుండీ ఆదాయం...
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లలో ఎక్కువ ఖాళీగానే ఉన్నాయి. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం మాత్రమే పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,177 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,694 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.












Tags:    

Similar News