Tirumala : తిరుమలలో ఇంతటి రద్దీ ఎప్పుడూ లేదే... ఈరోజు దర్శనం కావాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.

Update: 2024-05-26 03:22 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. గత పది రోజుల నుంచి తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లలో గంటల తరబడి శ్రీవారి దర్శనం కోసం వేచి చూడాల్సి వస్తుంది. శిలాతోరణం వరకూ భక్తులను ఉచిత బస్సుల్లో టీటీడీ చేరవేస్తుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్వనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణ తేజ గెస్ట్‌హౌస్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. సర్వదర్శనం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 44,479 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చింది.


Tags:    

Similar News