Tirumala : తిరుమల వెళుతున్నారా.. అయితే మీకొక గుడ్ న్యూస్.. సులువగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తులు తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తులు తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. దీంతో కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూడకుండానే శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వేసవి కాలం మొదలు కావడంతో పాటు విద్యాసంస్థలకు సెలవులు ఉండటంతో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుుతుందని భావించి అందుకు తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
వేసవి రద్దీ ఉండటంతో...
మరోవైపు వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని అనుసరించి సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు ముందస్తుగానే తీసుకుంటుంది. ఇందులలో భాగంగా సిఫార్సు లేఖలను స్వీకరించడం మానేసింది. అలాగే బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేయడంతో సులువుగా సర్వదర్శనం క్యూ లైన్ లోని భక్తులు కూడా తిరుమల శ్రీవారిని సులువుగా దర్శనం చేుకుంటున్నారు. క్యూ లైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండానే నేరుగా దర్శనం చేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కల్పించారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరముల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 83,380 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,936 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.35 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.