నేడు విజయవాడకు శ్రీచరణి
మహిళల వరల్డ్ కప్ లో విజయం సాధించిన తర్వాత జట్టులో ఉన్న క్రికెటర్ శ్రీచరణి విజయవాడ రానున్నారు
మహిళల వరల్డ్ కప్ లో విజయం సాధించిన తర్వాత జట్టులో ఉన్న క్రికెటర్ శ్రీచరణి విజయవాడ రానున్నారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణికి ఈ రోజు విజయవాడలో మహిళ క్రికెటర్ శ్రీ చరణికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ చరణికి భారీగా ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8:30గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న శ్రీచరణికి స్వాగతం పలకనున్నారు.
భారీ ర్యాలీతో...
గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు విజయోత్సవ ర్యాలీని నిర్వహించనున్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ లను శ్రీ చరణి కలవనున్నారు. శ్రీచరణికి స్వాగతం పలికేందుకు క్రికెట్ అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీచరణికి నజరానా ప్రకటించే అవకాశముంది.