Andhra Pradesh : చంద్రబాబును కలిసిన శ్రీచరణి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును క్రికెటర్ శ్రీచరణి కలిశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును క్రికెటర్ శ్రీచరణి కలిశారు. ఆమె వెంట మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ కూడా ఉన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి వారు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించారు.
వరల్డ్ కప్ లో గెలిచినందుకు ...
వరల్డ్ కప్ లో గెలిచినందుకు భారత జట్టుకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఛాంపియన్ జట్టులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమ్మాయి శ్రీచరణి ఉండటం ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. మరిన్ని మ్యాచ్ లు ఆడి దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సమావశంలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.