నేడు వంశీ కస్టడీ పిటిషన్‌పై కోర్టు ఉత్తర్వులు
నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగనుంది
నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగనుంది. కస్టడీ పిటీషన్ పై వాదనలు పూర్తయ్యాయి. నేడు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయనుంది. వంశీ కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ ముగియడంతో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.
టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో...
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరింత విచారణకు తమకు పది రోజుల కస్టడీకి వల్లభనేని వంశీని అప్పగించాలని పోలీసులు పిటీషన్ వేశారు. అయితే వంశీ తరుపున న్యాయవాదులు మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఇందులో విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మరి ఈరోజు తీర్పు ఎలా రానుందన్న దానిపై వంశీ వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది.