మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో న్యాయస్థానం పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించింది.

Update: 2025-07-25 03:48 GMT

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో న్యాయస్థానం పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. వెంకటాచలం ఎమ్మార్వో కార్యాలయంలో ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారని కేసు నమోదు అయింది. పీటీ వారెంట్ పై కాకాణిని రెండోవ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా పోలీసులు హాజరు పరిచారు.

వచ్చే నెల ఏడు వరకూ...
ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆగస్టు ఏడో తేదీవ వరకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి రిమాండ్ విధించారు. ఇప్పటికే వివిధ కేసుల్లో నెల్లూరు సెంటర్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డిపై వరస కేసులు నమోదవుతున్నాయి. అనేక కేసులలో ఆయన నిందితుడిగా నెల్లూరు జైలులో ఉన్నారు. ఇంకా ఎన్ని కేసులు నమోదవుతాయన్న ఆందోళనను ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News