వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 25వ తేదీ వరకూ పొడిగిస్తూ ఎస్. సి, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వర్చువల్ గా వల్లభనేని వంశీని విచారించిన న్యాయస్థానం ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
వరస కేసులు...
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసుల్లో వల్లభనేని వంశీ అరెస్టయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మైనింగ్ అక్రమంగా రవాణా చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అనేక ఫిర్యాదులు అందడంతో వరస కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో నమోదయిన కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ను పొడిగించింది.