పోలీసు కస్టడీకి తురకా కిశోర్

మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోర్ ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది

Update: 2025-05-23 03:55 GMT

మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోర్ ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. 2009లో హత్యాయత్నం కేసులో విచారించడానికి ఈ కస్టడీకి అప్పగించింది 2009లో ప్రభుత్వం చల్లా శివకుమార్ కుడ మాచర్లలో ఇంటి స్థలం ఇచ్చింది. దాని పక్కనే మరొక స్థలాన్ని కొనోగోలు చేసి తన కుమార్తె నాగరాణి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అంులో ఆమె ఇ్లు నిర్మించగా శివకుమార్ అందులో నివసిస్తున్నారు.

ఇంటిపై దాడి చేసి...
ఆ ఇంటిపై దాడి చేసిన కిశోర్ శివకుమార్ తో పాటు ఆయన భార్యపై హత్యాయత్నం చేశాడన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారు. ఈ కేసులో విచారణకు తురకా కిశోర్ ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించడంతో నేటి నుంచి పోలీసులు ప్రశ్నించనున్నారు.


Tags:    

Similar News