పీఎస్ఆర్ ఆంజనేయులుకి రిలీఫ్
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయనకు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. పీఎస్ఆర్ ఆంజనేయులు గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. బీపీలో హెచ్చుతగ్గుల సమస్యలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు.
మధ్యంతర బెయిల్ మంజూరు...
దీంతో పీఎస్ఆర్ ఆంజనేయులు తరుపున న్యాయవాదులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో పాటు గుంటూరు ఆసుపత్రివైద్యుల నుంచి హెల్త్ రిపోర్టును కోరిన న్యాయస్థానం ఆయనకు మధ్యంతరబెయిల్ మంజూరు చేసింది. తిరిగిఈ నెల 26వ తేదీన న్యాయస్థానంలో హాజరు కావాలని కోరింది.