నేడు సామర్లకోట మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ పై అవిశ్వాసం

నేడు కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ ‍పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు

Update: 2025-05-15 03:37 GMT

నేడు కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ ‍పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సామర్లకోట మున్సిపాలిటీలో మత్తం ఇరవై తొ్మిది మంది వైసీపీ, ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. అయితే మున్సిపల్ చైర్ పర్సన్ అరుణపై 22 మంది వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరడంతో ఎన్నిక నిర్వహించనున్నారు.

విప్ జారీ చేసిన వైసీపీ...
అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని వైసీపీ కౌన్సిలర్లకు విప్ జారీ అయింది. ఇప్పటికే మున్సిపల్ చైర్ పర్సన్ అరుణను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ విప్ జారీ చేసింది. వైసీపీలో గెలిచిన కౌన్సిలర్లు కూటమి పార్టీల్లో చేరడంతో ఈ మున్సిపల్ ఛైర్మన్ పదవి కూడా కూటమి ఖాతాలోనే పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News