బెజవాడ ఆసుపత్రిలో కరోనా కలకలం

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. పెద్ద సంఖ్యలో వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు

Update: 2022-01-22 08:49 GMT

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. పెద్ద సంఖ్యలో వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో జిల్లాల నుంచి స్పెషలిస్ట్ లను రప్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభుత్వాన్ని కోరింది. కరోనా సోకిందని తమకు తెలియకుండానే ఆసుపత్రులకు వస్తుండటంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు.

వంద మంది వరకూ....
యాభై మంది హౌస్ సర్జన్స్ తో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది కలిసి మొత్తం వంద మంది వరకూ ఆసుపత్రిలో కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలున్న వారు కూడా సాధారణ రోగుల్లా వచ్చి వైద్యులను కలవడంతో కరోనా సోకిందని భావిస్తున్నారు. కరోనా లక్షణాలు కనపడితే ఐసొలేషన్ లోనే ఉండాలని, ఆసుపత్రికి పరుగులు తీయవద్దని వైద్యులు కోరుతున్నారు. కరోనా బారిన పడిన వైద్యులు, సిబ్బంది ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. వీరి స్థానంలో జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించాలని కోరుతున్నారు.


Tags:    

Similar News