Corona Virus : ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో మూడు కోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా ఏలూరు కు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన మరొక వృద్ధుడికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధుడు మాత్రం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో...
మణిపాల్ ఆసుపత్రిలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల విశాఖ జిల్లాలో ఇద్దరు, నంద్యాల, కడప జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ సోకడంతో మొత్తం ఏడుగురికి ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలు రద్దీ ప్రదేశంలోకి వెళ్లిన సమయంలో మాస్క్ లు ధరించాలని ప్రభుత్వం కోరింది. బయటకు వెళ్లి వచ్చినప్పుడు శానిటైజర్లతో చేతులు శుభ్రపర్చుకోవాలని సూచించింది.