ఏపీపై కరోనా పంజా.. కొత్తగా 10 వేలకు పైగా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 41,713 మంది నుంచి సేకరించిన కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 10,057 కేసులు బయటపడ్డాయి. వీటితో

Update: 2022-01-19 12:54 GMT

ఏపీపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందని, ప్రజలు కాస్త ఉపశమనం పొందేలోపే కరోనా రెచ్చిపోతోంది. 10 రోజులుగా రాష్ట్రంలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఒక్కరోజులో భారీ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో 10 వేలకు పైగా కొత్తకేసులు బయటపడ్డాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 41,713 మంది నుంచి సేకరించిన కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 10,057 కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి ఏపీలో ప్రస్తుతం 44,935 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అలాగే ఇదే సమయంలో మరో 8 మంది కరోనాతో చనిపోవడంతో.. మృతుల సంఖ్య 14,522కి పెరిగింది. కరోనా కారణంగా విశాఖలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్ లో పేర్కొంది. కొత్తగా 1222 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 20,65,089గా ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 3 కోట్ల 19 లక్షల 64 వేల 682 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 21,27,441మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది.



Tags:    

Similar News