ఏపీ సినిమా హాల్స్ లో కోవిడ్ ఆంక్షలు అమలవుతున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్లు నడపాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో యజమానులు ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడక తప్పట్లేదు.
Also Read : గండ్ర దంపతులకు కోవిడ్.. ఆందోళనలో మంత్రులు
విశాఖ జిల్లాలోని సినిమా థియేటర్లలో కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. కోవిడ్ ఆంక్షలకు తోడు వివిధ నిబంధనల పేరుతో థియేటర్లకు అధికారులు నోటీసులు జారీ చేయడం.. థియేటర్ల యజమానులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్లను నడపలేమని అంటున్నారు యజమానులు. కరోనా వల్ల ఇప్పటికే దివాలా తీసిన థియేటర్లను మరిన్ని ఆంక్షలతో నడపాలంటే కష్టతరమని, ఇక థియేటర్లను మూసివేయడం తప్ప వేరే గత్యంతరం లేదని వాపోతున్నారు.