ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి.
విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,297 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.
500 లోపే...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,04,082 గా ఉంది. 485 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,33,50,309 నమూనాలను పరీక్షించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగం చేసినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.