ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 59 కొత్త కేసులు నమోదయ్యాయి.

Update: 2022-03-15 12:22 GMT

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 59 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,18,943 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.

యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,03,690 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 523 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,32,78,495 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News