Corona Virus : సిక్కోలులో కోవిడ్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ కోవిడ్ కేసు నమోదయింది
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే గుంటూరు, నంద్యాల, కడప, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ కోవిడ్ కేసు నమోదయిందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. జ్వరం, గొంతునొప్పితో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తికి వైద్యులు పరీక్షలు చేయగా కరోనా అని నిర్ధారణ అయింది.
హోం ఐసొలేషన్ లో ఉండి...
అయితే వెంటనే ఆ వ్యక్తిని కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఏపీలో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు అయినా ఎక్కువ మంది హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని వైద్యులు కోరుతున్నారు. లేకుంటే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుందని చెబుతున్నారు.