బసవతారకం ఆసుపత్రి నిర్మాణపై బాలకృష్ణ అప్ డేట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ముహూర్తం ఖరారాయింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ముహూర్తం ఖరారాయింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించి ట్రస్ట్ కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరవుతారని బాలకృష్ణ తెలిపారు.
మూడు దశల్లో నిర్మాణం...
అనంతవరం సమీపంలో రహదారి పక్కన ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన నందమూరి బాలకృష్ణ ఈ విషయాన్నివెల్లడించారు. 21 ఎకరాల్లో బసవతారకం ఆసుపత్రిని దశల వారీగా నిర్మిస్తామని తెలిపారు. మూడు దశల్లో నిర్మించే ఈ ఆసుపత్రి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. క్యాన్సర్ తో బాధపడుతున్న వారు ఇక హైదరాబాద్ చుట్టు తిరిగే అవకాశం లేకుండా ఇక్కడే అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.