కుప్పం ఘటనపై షర్మిల ఏమన్నారంటే?

అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషమని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

Update: 2025-06-17 06:02 GMT

అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషమని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సభ్య సమాజం తల దించుకొనే దుశ్చర్య ఇది అని, కన్న కొడుకు ముందే తల్లికి జరిగిన ఘోర అవమానం అని షర్మిల అన్నారు. సాటి మహిళగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్న షర్మిల తెలుగింటి ఆడపడుచుకి సీఎం ఇలాకాలోనే రక్షణ లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనమని తెలిపారు.

చట్టాన్ని చేతుల్లోకి...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే ధైర్యం కుప్పంలో చంద్రబాబు గారు ఇచ్చారా ? లేక మహిళా హోంమంత్రి గారు ఇచ్చారా ? మహిళల మీద ఇలాంటి దాడులు జరగడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. ఆడపడుచుల పక్షపాతి అని, తెలుగింటి ఆడపడుచుల పార్టీ తెలుగుదేశం పార్టీ అని, గొప్పలు చెప్పుకోవడం పక్కన పెట్టి ఇలాంటి అమానవీయ ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూడాలని పిలుపు నిచ్చారు. ఆ మహిళకు జరిగిన అవమానానికి బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


Tags:    

Similar News