ఫోన్ ట్యాపింగ్ పై షర్మిల లేటెస్ట్ గా ఏమన్నారంటే?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మళ్లీ కేసీఆరే గెలిచి ఉంటే ఇదంతా బయటకు వచ్చేది కాదన్న షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదన్నారు. ఆరోజు తన ఫోన్ కూడా ట్యాప్ చేసి తనకే ఆడియో వినిపించారన్నారు.
తాను ఫిర్యాదు చేసినా...
కానీ ఆ సమయంలో తాను ఏమీ చేయాలని పరిస్థితిలో ఉన్నానని, ఒకపక్క జగన్, ఇంకోపక్క కేసీఆర్ సీఎంలుగా ఉన్నారని, అప్పటికే నన్ను తొక్కే ప్రయత్నాలు చాలా చేస్తున్నారన్నారు వైఎస్ షర్మిల. ఫోన్ ట్యాపింగ్ పై తాను పోరాటం చేసినా ఇరు రాష్ట్రాల్లో దానిపై దర్యాప్తు జరిగేది కాదని ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ల చేతిలోనే ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.