సిమెంట్ ధరలకు రెక్కలు

సిమెంట్ ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. యాభై కిలోల సిమెంట్ బస్తాకు రూ.20 నుంచి 30లు పెరిగింది.

Update: 2022-06-03 03:28 GMT

సిమెంట్ ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. యాభై కిలోల సిమెంట్ బస్తాకు రూ.20 నుంచి 30లు పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ ధరలను పెంచుతూ సిమెంట్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సిమెంట్ పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతోనే ధరలను పెంచాల్సి వచ్చిందని పరిశ్రమల యాజమాన్యం తెలిపింది.

ఏపీ, తెలంగాణల్లో.....
పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో పాటు ఇంధన వ్యయం కూడా ఎక్కువ కావడంతో ధరలు తప్పనిసరి స్థితిలో పెంచాల్సి వచ్చిందని పరిశ్రమల యాజమాన్యం చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సిమెంట్ బస్తాపై రూ. 20లు పెంచగా తమిళనాడులో రూ.30 వరకూ పెరిగింది. ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుతం 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.320లు - రూ.400 మధ్య ఉంది.
.


Tags:    

Similar News