Andhra Pradesh : రేపు అనంతపురంలో సూపర్ హిట్ సభ

రేపు అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగసభ నిర్వహిస్తుంది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు.

Update: 2025-09-09 04:03 GMT

రేపు అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగసభ నిర్వహిస్తుంది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ సభకు హాజరు కానున్నారు. సూపర్‌ సిక్స్‌-సూపర్‌హిట్‌ పేరిట కూటమి ప్రభుత్వం ఉమ్మడి సభ నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధిపై ప్రజలకు వివరించనున్నారు.

పదిహేను నెలల్లోనే...
అధికారంలోకి వచ్చాక మూడు పార్టీలు కలిసి తొలిసారిగా సభ నిర్వహిస్తున్నారు.కూటమి సభకు లక్షమంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు ఏర్పాట్లను పరిశీలించనున్న టీడీపీ నేతలు, ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.


Tags:    

Similar News