మేకపాటి కుటుంబానికి కీలక పదవి

మేకపాటి కుటుంబానికి కూటమి సర్కార్ పదవి ఇచ్చింది

Update: 2025-12-12 03:27 GMT

మేకపాటి కుటుంబానికి కూటమి సర్కార్ పదవి ఇచ్చింది. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, నాలుగు సార్లు శాసనసభ్యుడిగా సేవలందించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మేకపాటి శాంతి కుమారినినెల్లూరుజిల్లా గ్రంథాలయం చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు.

గ్రంధాలయ ఛైర్మన్ గా...
అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయనకు ఉదయగిరి నియోజకవర్గం టిక్కెట్ ను టీడీపీ ఇవ్వలేదు. మేకపాటి కుటుంబం ప్రాంతీయంగా ప్రజాసేవకు చేసిన కృషిని గుర్తిస్తూ వచ్చిన ఈ నియామకాన్ని స్థానిక నాయకులు, టిడిపి కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం ఉన్న కుటుంబానికి గ్రంథాలయం చైర్మన్ పదవి దక్కడం ఉత్తేజకరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News