CM YS Jagan: సైకిల్‌ చక్రం తిరగడం లేదు.. అందుకే చంద్రబాబు ఢిల్లీలో మోకరిల్లుతున్నాడు: సీఎం జగన్‌

సైకిల్‌ చక్రం తిరగడం లేదు.. అందుకే చంద్రబాబు ఢిల్లీలో మోకరిల్లుతున్నాడని,

Update: 2024-03-10 12:23 GMT

AP CM YS Jagan

సైకిల్‌ చక్రం తిరగడం లేదు.. అందుకే చంద్రబాబు ఢిల్లీలో మోకరిల్లుతున్నాడని, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో 'సిద్ధం' సభ భారీగా నిర్వహిస్తున్నారు. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్‌ని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ సిద్ధం సభ నిర్వహించింది వైసీపీ. ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్‌ టీడీపీ, చంద్రబాబు నాయుడుపై ఆక్రోశం వెళ్లగక్కారు.

మనం ప్రజల దగ్గరకు వెళ్తుంటే.. చంద్రబాబు పార్టీల దగ్గరకు వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సైకిల్‌ తుప్పుపట్టిపోయిందని, తుప్పుపట్టిన సైకిల్‌ను తోయడానికి ఇతర పార్టీలు కావాలని, అందుకే ఢిల్లీకి వెళ్లాడని ఆరోపించారు. నాకు ఎవరితోనూ పొత్తు లేదు.. నాకు స్టార్‌ క్యాంపెయినర్లు ప్రజలేనని అన్నారు. చంద్రబాబు ఏం చేయమంటే దత్తపుత్రుడు అది చేస్తాడు విమర్శించారు. పొత్తులు పెట్టుకున్న కొన్ని పార్టీలకు సైన్యమే లేదని, దత్తపుత్రుడితో కలిసివెళ్లి మోకరిల్లుతునన్నాడని ఆరోపించారు.

పొత్తులు, ఎత్తులు, జిత్తులతో కొన్ని పార్టీలు రాజకీయం

పొత్తులు, ఎత్తులు, జిత్తులతో కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. దాని విలువ సున్నా అని ఎద్దేవా చేశారు. మూడు పార్టీలు 2014లోనూ పొత్తులు పెట్టుకున్నాయని విమర్శించారు. అప్పట్లో ఈ మూడు పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నాడని సీఎం జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు మేనిఫెస్టోకు శకుని చేతిలో పాచికలకు తేడా లేదన్నారు.

చంద్రబాబు ఇచ్చిన 7 హామీలకు ఏటా రూ.87,312 కోట్లు కావాలని, ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తారో చంద్రబాబు చెప్పడం లేదన్నారు. ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలి.. సైకిల్‌ ఇంటి బయట ఉండాలి.. టీ గ్లాస్‌ సింకులో ఉండాలంటూ వ్యాఖ్యానించారు. త్వరలో పూర్తి స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో లంచాలు లేని రాష్ట్రంగా చేయాలన్నదే నా కళ.. ఇదే నా లక్ష్యమన్నారు.

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు రద్దు అవుతాయి

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు కొనసాగుతాయని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు రద్దు తప్పదన్నారు. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని, లంచాలు, వివక్షల రాజ్యం వస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందని గతంలో చంద్రబాబు అన్నారని, చంద్రబాబు వస్తే చెప్పే అబద్దాలకు హద్దే లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెబుతున్న ఆరు వాగ్ధానాలకు సంవత్సరానికి రూ.73,440 కోట్లు అవుతాయన్నారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు హామీలు ఇస్తున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం జగన్‌.

Tags:    

Similar News