చంద్రబాబు.. 14 ఏళ్లలో పాలనలో ఏం చేశావ్: సీఎం జగన్‌

అవినీతికి ఎక్కడా తావు లేకుండా అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం వైఎస్‌ గజన్‌ అన్నారు. పేదల ఇళ్ల కోసం తమ సర్కార్‌ ఎంతో

Update: 2023-06-16 09:37 GMT

అవినీతికి ఎక్కడా తావు లేకుండా అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం వైఎస్‌ గజన్‌ అన్నారు. పేదల ఇళ్ల కోసం తమ సర్కార్‌ ఎంతో కృషి చేసిందని, అయితే 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ ఎందుకు చేయలేకపోయారని సీఎం జగన్‌ నిలదీశారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. టీడీపీ పెత్తందారుల పార్టీ అన్న సీఎం జగన్‌.. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని, అందుకే ఏం చేయలేదని విమర్శించారు. పేదవాడికి చంద్రబాబు ఏనాడూ సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా.. టిడ్కో ఇళ్లు కట్టలేకపోయారని అన్నారు.

తమ ప్రభుత్వం టిడ్కో ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా.. రిజిస్ట్రేషన్‌ చేసి మరీ ఇస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో టిడ్కో ఇళ్లు కావాలంటే డబ్బు కట్టాల్సి వచ్చేదని, ఈ భారం పేదలపై పడితే 20 ఏళ్ల పాటు నెలకు రూ.3 వేల చొప్పున కట్టాల్సి వచ్చేదన్నారు. టిడ్కో ఇళ్ల రూపంలో చంద్రబాబు గత ప్రభుత్వం పేదల ఇళ్లపై అప్పల భారం మోపి బ్యాంకుల చుట్టూ తిరిగే స్థితికి తీసుకువచ్చారన్నారు. బాబు పాలనకు తమ పాలనకు తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్‌ కోరారు. ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని అన్నారు. అని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు నడుస్తోందన్నారు.

"పేదలకు ఏనాడూ మంచి చేయని చంద్రబాబు ఇంకో ఛాన్స్ ఇస్తే అది చేస్తా.. ఇది చేస్తా.. ఇంటికో కేజీ బంగారం ఇస్తా.. ఓ బెంజ్ కారు ఇస్తా.. అంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు బయలుదేరారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి పేదలకు ఇది నేను చేసిన మంచి ఇది అని చెప్పుకునే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా?. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి చివరికి కుప్పంలో పక్కా ఇళ్లు కట్టని చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని నాకు ఉత్తరం రాసి కోరుకుతున్నారు. సంక్షేమ పథకాలన్నీ కాక ఒక్క పేదలందరికీ ఇళ్లు పథకంలోనే రాష్ర్టంలో ఇళ్లు లేని ప్రతి పేద అక్కచెల్లెమ్మల చేతిలో ఇళ్ల రూపంలో రూ. 7 నుంచి రూ. 15 లక్షల ఆస్థిని ఇచ్చాను. చంద్రబాబుకు దమ్ముంటే అదే పేదలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలంటూ" సీఎం జగన్ సవాల్‌ విసిరారు.

పేదల గుండెచప్పుడు తెలుసు, పేదల అండతో, పేదల్లోంచి, కష్టం నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని సీఎం జగన్‌ అన్నారు. చంద్రబాబు నిత్యం పోత్తుల్ని, ఎత్తుల్ని, కుట్రల్ని నమ్ముకున్నారని ఆరోపించారు. 175 నియోజకవర్గాల్లో కనీసం ఎమ్మెల్యే అభ్యర్థులను నిలపలేని టీడీపీ మన ప్రత్యర్థా?.. అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే పుట్టిన ప్యాకేజీ స్టార్, గత ప్రభుత్వం అంకాగిన ఎల్లో మీడియా మరో సారి రాష్ట్రాన్ని దోచుకునేందుకు కుట్రలు చేస్తోందన్నారు. కలిసి కట్టుగా రాష్ట్రాన్ని దోచుకోవాలని తోడేళ్ల గుంపు ఎదురు చూస్తోందన్నారు.

''ఈ తోడేళ్ల గుంపు ఉన్నా మీ బిడ్డ ఒంటరిగా పోటీకి దిగుతాడు. మీ బిడ్డకు పేదలే అండ, ప్రజలకు చేసిన మంచే భరోసా.. దేవుడి దయ, పేదల అండను నమ్మి ఒంటరిగా ఎన్నిలకు దిగుతా. మీ బిడ్డ చెప్పేది కోరేది ఒక్కటే.. అబద్దాలను నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరుగుంటే మాత్రమే కొలమానంగా తీసుకుని మీ బిడ్డకు సైనికులుగా నిలబడండి" అని సీఎం జగన్ కోరారు.

Tags:    

Similar News