కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ ఇచ్చిన నాదెండ్ల

ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Update: 2025-07-29 13:32 GMT

ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 31వతేదీనాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. QR కోడ్ తో అందించే కొత్త కార్డులపై నేతల ఫొటోలు ఉండవని ఆయన స్పష్టం చేశారు

డిజిటల్ కార్డులు...
పాత రేషన్ కార్డుల ప్లేస్‌లో డిజిటల్ కార్డులు ఇస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవన్న ఆయన ఎక్కడికైనా తీసుకెళ్లేలా డెబిట్, క్రెడిట్ కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డులుంటాయని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. సినిమాకు ప్రమోషన్ చేస్తే తప్పేంటి? మా సినిమాకు మేం ప్రమోషన్ చేసుకుంటామని, తమ పార్టీ అధ్యక్షుడు పవన్.. ఆయన సినిమా కాబట్టి ప్రమోషన్ చేశామని నాదెండ్ల మనోహర్ అన్నారు. దీనికి మంత్రుల స్థాయి అనేవి అనవసరం అని ఆయన అన్నారు.


Tags:    

Similar News