Chandrababu : గల్ఫ్ దేశాల పర్యటనకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్ దేశాల పర్యటనకు షెడ్యూల్ ఖరారయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్ దేశాల పర్యటనకు షెడ్యూల్ ఖరారయింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం కోసం ఆయన గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో పాటు స్థిరపడిన భారతీయులు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారితో ప్రత్యేకంగా సమావేశమై పీ 4 స్కీమ్ గురించి కూడా వివరించనున్నారు. పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు నివ్వనున్నారు.
ఈ నెల 22 నుంచి...
ఈ నెల 22 నుంచి 24 వరకు దుబాయ్, అబుదాబి, యూఏఈల్లో సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు సంబంధించి అధ్యయనం కోసం పర్యటన ఉంటుంది. ఆయా దేశాల్లోని రియల్ ఎస్టేట్, నిర్మాణం, రవాణా, ఆర్థిక సేవలు, ఏఐ, ఈ-కామర్స్, పునరుత్పాదక ఇంధన వనరులు, పర్యాటకం తదితర రంగాల అధ్యయనం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విదేశీ పర్యటనకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా బయలుదేరి వెళ్లనున్నారు.