Chiranjeevi : చిరంజీవి స్ట్రయిట్ గానే అందరికీ క్లారిటీ ఇచ్చినట్లయిందిగా.. బాలయ్య కెలికి గోక్కున్నట్లుందిగా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర పరిశ్రమ చిచ్చు రేపుతున్నట్లు కనిపిస్తుంది.

Update: 2025-09-26 07:07 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర పరిశ్రమ చిచ్చు రేపుతున్నట్లు కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మెగాస్టార్ అభిమానులతో పాటు జనసైనికులు, కాపు సామాజికవర్గం నేతలు కూడా రగిలిపోతున్నారు. అసలు ఏపీ పాలిటిక్స్ లో టాలీవుడ్ కూటమి పార్టీల మధ్య దూరం పెంచేలా ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అసలు శాంతి భద్రతల సమస్యపై మాట్లాడాల్సిన సభలో సీనియర్ నేత, మాజీ మంత్రి కామినేని జగన్ యాటిట్యూడ్ ను వివరించడంలో భాగంగా నాడు చిరంజీవి వత్తిడి తేవడం వల్లనే జగన్ నాడు దిగివచ్చి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో మాట్లాడారని అన్నారు. అయితే దీనికి నందమూరి బాలకృష్ణ మాత్రం డిఫర్ అయ్యారు.

బాలయ్య వ్యాఖ్యలతో...
నాడు జగన్ పై ఎవరూ వత్తిడి తేలేదని, చిరంజీవితో సహా ఎవరూ జగన్ ను అడగలేదన్నారు. కామినేని శ్రీనివాస్ చెప్పేది అబద్ధమని అన్నారు. పైగా జగన్ ఆ సైకో గాడిని కలవడానికి ఇండ్రస్ట్రీ వాళ్లు వెళ్లినప్పడు గట్టిగా ఎవరూ అడగలేదని చెప్పారు. జగన్ చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఆవరించారని, చిరంజీవి గట్టిగా అడిగితే ఆయన వచ్చాడా? ఎవరు అడిగారు ఆయనను అని బాలకృష్ణ అన్నారు. అయితే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తమ అభిమాన హీరోను అవమానించే విధంగా మాట్లాడారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను విరమించుకోవాలంటూ పెద్ద యెత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.మరొకవైపు నందమూరి బాలకృష్ణ కామెంట్స్ కు చిరంజీవి కౌంటర్ ఇచ్చారు.
మెగా ఫ్యాన్స్ ఫైర్...
విదేశాల్లో ఉన్న చిరంజీవి బహిరంగ లేఖను విడుదల చేశారు. వైఎస్ జగన్ పిలిస్తేనే తాను వెళ్లానని చిరంజీవి తెలిపారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానిస్తే వెళ్లానని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు తాను సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందులను వివరించడానికి వెళ్లానని చిరంజీవి చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందులను తాను వివరించానని అన్న చిరంజీవి సమయం ఇస్తే అందరం కలిసి వస్తానని జగన్ కు తాను చెప్పానని అన్నారు. జగన ను కలవడానికి ముందు తాను బాలకృష్ణకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేస్తే ఆయన అందుబాటులో లేరని చిరంజీవి అన్నారు. అప్పుడు కరోనా ఉన్నందున ఐదుగురు మాత్రమే రావాలని అన్నారు. తాము పది మంది మాత్రమే వస్తామని చెప్పడంతో జగన్ అంగీకరించారని చిరంజీవి చెప్పారు. తన చొరవ వల్లనే ఏపీలో నాడు సినిమా టిక్కెట్ల ధరలు పెరిగాయన్నారు. దీంతో బాలయ్యకు చిరంజీవి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినట్లే కనపడుతుంది. బాలకృష్ణ మాటలు కూటమిలో చిచ్చు పెట్టేలా ఉన్నాయంటున్నారు. తన సోదరుడిని జగన్ అవమానించారన్న పవన్ కల్యాణ్, నేరుగా బాలకృష్ణ చిరంజీవిని తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలను పవన్ ఎలా తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News