వామ్మో చలి.. గజగజ

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు

Update: 2023-01-10 03:27 GMT

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. బయటకు వచ్చేందుకు కూడా భయపడి పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని లంబసింగిలో ఒక డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు కావడంతో అక్కడ పర్యాటకులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లిలో రెండు డిగ్రీల ఉష్ణోగరతలను నమోదయింది.

లంబసింగిలో ఒక డిగ్రీ...
ఎముకలు కొరికే చలిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఉదయం పది గంటల వరకూ సూర్యుడు కన్పించకపోవడంతో చలిమంటలు వేసుకుని తమను తాము రక్షించుకుంటుననారు. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడిపోతున్నారు. తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.


Tags:    

Similar News