Ys Jagan : నేడు వారికి జగన్ గుడ్ న్యూస్
సంక్షేమ పథకాలు అందని వారికి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అందచేయనున్నారు
jagan mohan reddy wished the people of the state for the new year
YS Jagan :సంక్షేమ పథకాలు అందని వారికి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అందచేయనున్నారు. వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి తిరిగి పథకాలను అందించే లక్ష్యంతో జగన్ ప్రతి పథకంలో లబ్దిదారులను తిరిగి గుర్తించి వారికి నగదును బదిలీ చేస్తున్నారు. నేడు ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి 68,990 మంది లబ్దిదారులకు 97.76 కోట్ల రూపాయలను నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
అర్హతలున్నా...
అధికారులు అర్హతల విషయంలో కొన్ని కారణాలు చూపి పక్కన పెట్టిన వారిని గుర్తించి వారికి మళ్లీ నిధులను విడుదల చేయనున్నారు. జనవరి - జూన్ మధ్య ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ కారణాలతో నిలిచిపోయిన వారికి ఈరోజు జగన్ తిరిగి జగన్ నిధులను బటన్ నొక్కి అందచేయనున్నారు.