ఇది నా అదృష్టం.. నాలుగేళ్ల నుంచి కరువు లేదు

నెల్లూరు జిల్లాలో రెండు ప్రాజెక్టులను ప్రారంభించి నేడు మంచి కార్యక్రమాలకు శ్రీకారంచుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

Update: 2022-09-06 12:13 GMT

నెల్లూరు జిల్లాలో రెండు ప్రాజెక్టులను ప్రారంభించి నేడు మంచి కార్యక్రమాలకు శ్రీకారంచుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సుమారు 320 కోట్ల రూపాయలతో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసుకున్నామని తెలిపారు.ఈ ప్రాజెక్టుల ద్వారా ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఆత్మకూరు, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాలలో భూములకు సాగునీరు అందుతుందన్నారు. గత నాలుగేళ్ల నుంచి కరవు అనేది లేదని, మంచి వర్షాలు కురుస్తూ రైతుల ముఖాల్లో ఆనందం నిండి ఉందన్నారు.

ఏ ముఖ్యమంత్రీ....
నెల్లూరు జిల్లాలో ఈ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 140 ఏళ్ల క్రితం బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ ఆనకట్టను ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దివంగత నేత వైఎస్ వచ్చిన తర్వాతనే వీటికి మోక్షం లభించిందన్నారు. ఏ ముఖ్యమంత్రీ నెల్లూరు జిల్లాకు మంచి చేయాలన్న ఆలోచన రాలేదన్నారు. ముఖ్యమంత్రిగా తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టులను తాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో ఈ పర్జెక్టు కోసం కేవలం 30 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి తన మిత్రుడని, ఈరోజు ఆయన ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో లేకపోవడం విచారకరమని తెలిపారు. అందుకే ఆయన పేరును పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన 14 కోట్లనిధులను మంజూరు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.


Tags:    

Similar News