ఈ ప్రభుత్వానిదే భరోసా

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదయిందన్నారు

Update: 2022-10-17 07:56 GMT

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదయిందని తెలిపారు. ఆళ్లగడ్డలో రైతు భరోసా నాలుగో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఏడాది రైతుకు ఖరీఫ్ సీజన్ లో సాగు కోసం 13,500 రూపాయలను విడుదల చేస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకు కూడా తమ ప్రభుత్వం సాయం అందిస్తుందని తెలిపారు.

బాబు హయాంలో...
చంద్రబాబు హయాంలో ఐదేళ్లు కరవు రాజ్యమేలిందని, కరవు, చంద్రబాబు కవల పిల్లలని ఆయన ఫైరయ్యారు. రాష్ట్రంలో చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు చేసే పనులను ప్రజలు గమనించాలని జగన్ కోరారు. చంద్రబాబు హయాలో 238 మండలాలు కరవు ప్రాంతాలుగా ఉన్నాయని, ఇప్పుడు ఒక్క కరవు మండలం కూడా లేదని ఆయన చెప్పారు. జగన్ ఈ సందర్భంగా 2,096 కోట్ల నగదును రైతు ఖాతాల్లో జమ చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మాట తప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.


Tags:    

Similar News