Ys Jagan : డిసెంబరు నుంచి గుడ్ న్యూస్ అన్న జగన్
జనవరి ఒకటోనుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు
Andhra pradesh
జనవరి ఒకటోనుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గుర్తించిన రోగులకు అవసరమైన మందులను పంపిణీ చేయలని అధికారులకు సూచించారు. ఆరోగ్య శ్రీపై విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. డిసెంబరు 20 నుంచి ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు.
ప్రతి మొబైల్ లో...
ప్రతి మొబైల్ లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్ ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ వినియోగంపై కూడా విస్తృత ప్రచారం చేయాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేయాలని జగన్ సూచించారు. ఆసుపత్రుల్లో సిబ్బంది లేరనే మాట వినపడకూడదని జగన్ అన్నారు. ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.