ఫోన్ లో పరామర్శించిన జగన్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను ముఖ్యమంత్రి జగన్ ఫోన్ లో పరామర్శించారు

Update: 2021-11-18 09:17 GMT

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను ముఖ్యమంత్రి జగన్ ఫోన్ లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. శాసనసభ విరామ సమయంలో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న గవర్నర్ కు జగన్ ఫోన్ చేశారు.

త్వరగా కోలుకోవాలని...
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా సోకడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అక్కడి వైద్యులతోనూ జగన్ మాట్లాడారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకు వచ్చారని అక్కడి వైద్యులు కూడా చెప్పారు.


Tags:    

Similar News