Revanth Reddy : ఎంతో రిస్క్ తీసుకున్నాకే నిర్ణయం

బీసీ రిజర్వేషన్ల కోసం ఎంతో రిస్క్ తీసుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2025-03-18 11:52 GMT

బీసీ రిజర్వేషన్ల కోసం ఎంతో రిస్క్ తీసుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తెచ్చేందుకు చాలా కసరత్తు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఇందుకోసం మళ్లీ పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో జరిగే ఆందోళనలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణన జరపాలని ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అని ఆయన గుర్తు చేశారు.

మేలు మరవకుంటే చాలు...
బీసీల ఆత్మీయసమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాను చేసిన మేలు మరవకపోతే చాలని, వారంతా తనకు అండగా నిలిస్తే అంతకు మించి ఏముంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాము ఇచ్చిన మాటకుకట్టుబడి బీసీ రిజర్వేషన్లకు చట్ట బద్దత కల్పించామన్న రేవంత్ రెడ్డి, బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ సూచనల మేరకే తాము కులగణన చేసినట్లు ఆయన తెలిపారు.


Tags:    

Similar News