Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది

Update: 2024-12-10 03:19 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 11.10 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు. అనంతరం ఆయన వివిధ అధికారులతో సమావేశమవుతారు. కొన్ని సమీక్షలను కూడా నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సీఆర్డీఏ సమీక్షలో...
చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం ఆర్జీజీపై సమీక్ష చేస్తారు. సాయంత్రం గ్రీవెన్స్ పై కూడా అధికారులతో సమీక్షను నిర్వహిస్తారు. అనంతరం సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుంటారు. సీఆర్డీఏ భవనం డిజైన్ల ఖరారుతో పాటు భవనాల టెండర్ల విషయంపై అధికారులతో చర్చిస్తారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News