సుజనా చౌదరికి చంద్రబాబు పరామర్శ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి ని పరామర్శించారు

Update: 2025-05-18 02:34 GMT

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి ని పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తూ గాయపడిన ఆయన కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాదులోని సుజనా చౌదరి నివాసం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

ఆరోగ్యపరిస్థితిపై...
సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితి ,యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సుజనా చౌదరి త్వరగా కోలుకొని , తిరిగి ప్రజా సేవకు పునరంకితం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. సుజనా చౌదరి వద్దకు వెళ్లిన చంద్రబాబు ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నదీ కూడా అడిగి చంద్రబాబుకు ఈ సందర్భంగా సుజనా చౌదరి వివరించారు.


Tags:    

Similar News