Chandrababu : నేడు ప్రకాశం జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లి మండలం లింగన్న పాలెంలో ఎంఎస్ఎంఈ పార్క్ ను చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి కనిగిరి నియోజకవర్గంలోని పెద చెర్లో పల్లికి చేరుకుంటారు. అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభిస్తారు.
వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను...
అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి 12.30 గంటలకు హెలికాపర్ట్ లో బయలుదేరి ఉండవల్లికి చేరుకుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వర్చువల్ గా రాష్ట్రంలోని అనేక పరిశ్రమలను ప్రారంభించనున్నారు. ఓర్వకల్లు, పెద్ద కడుబూరు, దేవరకొండ మండలాల్లో ఏర్పాటు చేచేయనున్న పరిశ్రమలకు వర్చువల్ గా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.