Hyderabad : పవన్ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు
హైదరాాబాద్ లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. వైరల్ ఫీవర్ బాధపడుతూ హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్న పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. గత కొన్ని రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కల్యాణ్ ను పరామర్శించేందుకు చంద్రబాబు స్వయంగా మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు ఆయన నివాసానికి రానున్నారు.
ఇటీవల పరిణామాల నేపథ్యంలో...
ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పాటుగా, ఇటీవల నందమూరి బాలకృష్ణ చిరంజీవి పై చేసిన కామెంట్స్ కూడా జనసేనలోనూ, మెగా అభిమానుల్లోనూ, కాపు సామాజికవర్గంలోనూ ఆగ్రహం కలిగించాయి. అయితే పవన్ కల్యాణ్ వీటిపై స్పందించలేదు. దీంతో చంద్రబాబు నాయుడు నేరుగా పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి పరామర్శించడమే కాకుండా ఇటీవల జరిగిన పరిణామాల విషయంపై చర్చించే అవకాశముందని తెలిసింది.