Chandrababu : కుప్పం పర్యటనలో చంద్రబాబు ఒప్పందాలివే

కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కంపెనీలతో ఒప్పందాలు చేశారు.

Update: 2025-07-03 03:29 GMT

కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కంపెనీలతో ఒప్పందాలు చేశారు. ఆయన సమక్షంలో నాలుగు కంపెనీలతో 1617 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. హిందాల్కో జనసేవా ట్రస్ట్ భాగస్వామ్యంతో కుప్పంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది.

1617 కోట్ల విలువైన...
200 కోట్ల రూపాయల వ్యయంతో ఇ-ఆటోలు, ఇ-బైక్స్, ఇ-స్వీపింగ్ ఎలక్ట్రిక్ మెషిన్ల తయారీ కంపెనీ ఇ-రాయస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం కుదిరింది. 525 కోట్ల రూపాయలతో సమీకృత పాల ఉత్పత్తులు, పోషకాహార కాంప్లెక్స్ ఏర్పాటుకు ఏస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం రూ.372.8 కోట్ల పెట్టుబడితో ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం కుదిరింది.


Tags:    

Similar News