Chandrababu : అశోక్ గజపతి రాజు సిగిరెట్ కథ ను చంద్రబాబు ఎలా చెప్పారంటే?
సింగపూర్ దేశాన్ని చూస్తే తనకు అసూయ కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
సింగపూర్ దేశాన్ని చూస్తే తనకు అసూయ కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్ లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు తాను ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్లలో సింగపూర్ పర్యటనకు వచ్చానని అన్నారు. నాడు అశోక్ గజపతి రాజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేవారని, అయితే ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు సిగిరెట్లు బాగా తాగే వాడని, కాని సింగపూర్ కు వచ్చినప్పుడు మాత్రం సిగిరెట్ మానేశారని చంద్రబాబు తెలిపారు.
సింగపూర్ కు రాగానే...
ఎందుకు తాగట్లేదని అశోక్ గజపతి రాజును ప్రశ్నిస్తే సింగపూర్ లో సిగిరెట్ తాగితే ఐదు వందల డాలర్లు జరిమానా వేస్తారని తనతో చెప్పారని అన్నారు. సింగపూర్ క్లీన్ కంట్రీగా పేరుందని అన్నారు. ఈ దేశాన్ని చూసిన తర్వాతనే తాను ఏపీలోనూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు. ఇక్కడ కరప్షన్ కూడా ఉండదని, తాను ట్యాక్సీ డ్రైవర్ కు టిప్ ఇవ్వకపోతే నిరాకరించాడని, ఇక్కడ అవినీతి లేకపోవడం కూడా తనను ఆకట్టుకుందని అన్నారు. ప్రవాసాంధ్రులు కొత్తగా ఏర్పడిన ఏపీకి తోడ్పడాలని పిలుపు నిచ్చారు.