Chandrababu : నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు

Update: 2025-07-02 02:37 GMT

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. పలు అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొనన్నారు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చంద్రబాబు నిర్వహించనున్నారు. నిన్న రాజమండ్రి నుంచి తిరుపతికి చేరుకున్న చంద్రబాబు నేడు కుప్పం నియోజకవర్గానికి వస్తారు.

సొంత ఇంట్లోనే బస...
మధ్యాహ్నం 12.30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసి లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న చంద్రబాబు కార్యకర్తలు, నేతలతో నేడు, రేపు సమావేశమవుతారు. కుప్పంలో నిర్మించిన తన సొంత ఇంట్లోనే బస చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున తరలి వచ్చే అవకాశముండటంతో అన్ని ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News