Andhra Pradesh : 12న విజయోత్సవ ర్యాలీలు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది సందర్భంగా ఈ నెల 12వ తేదీన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నిచ్చారు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది సందర్భంగా ఈ నెల 12వ తేదీన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, క్యాడర్ ను కోరారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 12న 175 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలను ఆదేశించారు.
అదే రోజు సాయంత్రం...
ఈ నెల పన్నెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు అమరావతిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజలకు కూటమి చేస్తున్న మంచి చెప్పడంతోపాటు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను గుర్తు చేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు.